కీలక వడ్డీరేట్లు యథాతథమే - ఆర్బీఐ 16 d ago
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోందన్నారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి కావడం గమనార్హం అని పేర్కొన్నారు.